ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మరోసారి వార్తల్లో నిలిచారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవడి పెళ్లి రిసెప్షన్‌కు వెళ్లిన మందకృష్ణకు తీవ్ర అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. రిసెప్షన్‌కు వెళ్లిన రాజకీయ ప్రముఖులందరికీ రాగి కంచాల్లో భోజనం పెడితే.. మందకృష్ణకు మాత్రమే విస్తరాకులో పెట్టారంటూ ఆరోపణలు పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. దీంతో.. ఈ ఆరోపణలపై మందకృష్ణ మాదిగ పూర్తి క్లారిటీ ఇచ్చారు. తనకు అసలైన అవమానం అదేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.