‘నాకు రాష్ట్ర విభజన ఇష్టం లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి..

7 months ago 21
తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై , విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని.. దానిని కాపాడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విఫలమయ్యారని ఆయన విమర్శించారు. వీరు ప్రధాని మోదీ ఆదేశాల మేరకే నడుచుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీలో ప్రజలు కులాల ఆధారంగా రాజకీయాలు చేసే వారికి పట్టం కట్టడం వల్లే ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎంపీలను గెలిపిస్తే పార్లమెంటులో పోరాడి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Read Entire Article