Nacharam Road Accident: స్కూల్ బస్సు మిస్సవడంతో.. కుమార్తెను పాఠశాలలో వదిలేందుకు వెళ్లి తల్లి దుర్మరణం పాలైన ఘటన హైదరాబాద్‌లోని నాచారంలో చోటు చేసుకుంది. కుమార్తెను పాఠశాలలో వదిలి వస్తుండగా.. వంట గ్యాస్ సిలిండర్ల లోడుతో వస్తున్న లారీ స్కూటీని వెనుక నుంచి ఢీకొట్టింది. మహిళ మీద నుంచి లారీ చక్రం వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని నీతాగా గుర్తించారు.