నాటుసారాతో ఫేక్ లిక్కర్.. తాగితే అంతే సంగతులు..!

3 hours ago 1
తిరుపతి నగర శివార్లలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. తిరుచానూరు సమీపంలోని దామినేడు ఎన్టీఆర్ కాలనీ బ్లాక్ నెంబర్ 62 లో మద్యం మెటీరియల్​ను అధికారులు పరిశీలించారు. కోడూరులో నకిలీ మద్యం పట్టుబడిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసి విచారణ చేయడంతో తిరుపతిలోని నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు బయటపడింది. దాంతో ఘటనా స్ధలానికి చేరుకుని ఎక్సైజ్ పోలీసులు నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు. రూ.4 లక్షల నగదు, 805 లీటర్ల స్పిరిట్‍, 6,600 ఖాళీ బాటిల్స్, వివిధ బ్రాండ్లతో కూడిన లేబుల్స్​ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.
Read Entire Article