Chandrababu Gift To Nara Bhuvaneswari: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిపై ప్రేమను చాటుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సతీమణి కోసం షాపింగ్ చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్స్‌లో నారా భువనేశ్వరి కోసం రెండు చీరలు కొనుగోలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కార్మికులు ఏర్పాటుచేసిన స్టాల్స్ ను ప్రారంభించి చీరలకు పరిశీలించారు. ఈ క్రమంలోనే తన భార్యకు చీరలు కొనుగోలు చేశారు చంద్రబాబు.