టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అలిపిరి మెట్ల మార్గంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేసింది. మెట్ల మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కేంద్రాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదివారం ప్రారంభించారు. మరోవైపు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఇటీవల అలిపిరిలో నెలకొన్న పరిస్థితులపై వీడియో ద్వారా నారా లోకేష్‌కు అభ్యర్థన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీటీడీ అలిపిరిలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేసింది.