కారులో వచ్చిన ముసుగు దొంగలు నాలుగు నిమిషాల్లో ఏటీఎంను గుల్ల చేశారు. గ్యాస్ కట్టర్లతో మెషిన్‌ను కోసి రూ.30 లక్షలు ఎత్తుకెళ్లారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎంలో ఈ భారీ దొంగతనం జరిగింది. కారులో వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు పక్కా ప్లానింగ్‌తో చోరీ చేశారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా స్ప్రే కొట్టి, ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా వైర్లు కట్ చేశారు. గ్యాస్ కట్టర్, ఇనుప రాడ్లతో ఏటీఎంను బద్దలు కొట్టి, నగదు పెట్టెతో సహా ఉడాయించారు.