నిధులు విడుదలకు గ్రీన్‌సిగ్నల్..! త్వరలో రాష్ట్రానికి కేంద్ర బృందాలు..!

6 months ago 8
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో అమిత్‌ షాను కలిశారు. ఆగస్టు 25–28 మధ్య కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నష్టాన్ని మిగిల్చాయని తెలిపారు. పంటలు, ఇళ్లు, చెరువులు, రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించారు. దాదాపు రూ.5,018 కోట్ల మేర నష్టం జరిగిందని.. దీన్ని జాతీయ విపత్తుగా గుర్తించి తక్షణ సాయం అందించాలని కోరారు. అత్యవసర మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గత సంవత్సరం వరదల వల్ల భారీ నష్టం జరిగినప్పటికీ తక్కువ సహాయం మాత్రమే లభించిందని గుర్తు చేశారు. ఈసారి కేంద్రం తగిన సాయం చేస్తుందని ఆశ వ్యక్తం చేశారు.
Read Entire Article