Sridhar Babu: తెలంగాణలో నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భర్తీపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటన చేశారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. అతి త్వరలోనే తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి తేల్చి చెప్పారు. శాసనసభలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా.. మంత్రి శ్రీధర్ బాబు జాబ్ క్యాలెండర్‌కు సంబంధించి కీలక ప్రకటన వెలువరించారు.