కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. స్థానికులకూ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. స్కిల్ ట్రైనింగ్ సెంటర్ల ద్వారా స్థానికులకు నైపుణ్యం కల్పించాలని పేర్కొన్నారు. ఆర్ అండ్ ఆర్ లేఔట్ లో పట్టాలు పొందిన రైతులకు 50 గజాల నుండి 75 గజాలకు పెంచడానికి టీజీఐఐసీ రెండు ఎకరాల భూమిని కేటాయించింది. వెంటనే లే అవుట్ ప్లాట్లు చేసి రాజీవ్ గాంధీ టౌన్ షిప్ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.