సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాబోయే రెండేళ్లలో లక్ష కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టిస్తామని.. నిరుద్యోగులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవమని ఆయన అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాతో కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందని పేర్కొన్నారు.