తెలంగాణలో నిషేధిత భూముల జాబితా నుంచి తమ ఆస్తులను తొలగించాలని కోరుతూ సుమారు 2.20 లక్షల ఎకరాలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయి. జిల్లా కలెక్టర్ల వద్ద దాదాపు 20 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. వాటిని 45 రోజుల్లో పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లో సమస్య ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో 93 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై దాదాపు 7 వేల కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి.