నీ గురువుకు పట్టిన గతే నీకూ పడుతుంది.. సీఎం రేవంత్‌పై కవిత కామెంట్లు

1 month ago 5
రేవంత్ రెడ్డి సర్కార్ ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఉద్యమ సమయంలో ప్రజలు టీజీని ఆమోదించారంటూ టీఎస్ స్థానంలో టీజీని తెచ్చామన్న సీఎం రేవంత్ రెడ్డి.. అదే ప్రజలు ఉద్యమంలో ఆమోదించుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు మార్చారంటూ నిలదీశారు. బీద తల్లిని పెట్టామంటున్న రేవంత్ రెడ్ది రాష్ట్రాన్ని బీద రాష్ట్రమని ప్రచారం చేస్తున్నారా, బీదలు ఎప్పుడు బీదలుగా ఉండాలనేదే వారి ఉద్దేశమా అని ప్రశ్నించారు. జొన్నలు, మక్కలు ఇతర రాష్ట్రాలలో కూడా పండుతాయని, సచివాలయంలో పెట్టిన విగ్రహంలో ఏ ప్రత్యేకత లేదని, తెలంగాణకు ప్రత్యేకమైన బతుకమ్మను మాయం చేసి, కాంగ్రెస్ హస్తం గుర్తును పెట్టడం దారుణమన్నారు. అసలు తెలంగాణ తల్లి ఉద్యమంలో ప్రజలు ఆమోదించుకున్న విగ్రహమే అసలైన తెలంగాణ తల్లి అని కవిత స్పష్టం చేశారు. నూటికి నూరుశాతం మీరు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం కాంగ్రెస్ విగ్రహామేనన్నారు. ప్రభుత్వం ఉద్యమ ప్రతీకలను అవమానించడం..మార్చడం మానుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. మరోసారి తెలంగాణ తల్లి విగ్రహం జోలికి రావద్ధని హెచ్చరించారు. తెలంగాణలో ఉద్యమకారుల జోలికి వస్తే ఏమవుతుందో మీ గురువు చంద్రబాబును అడిగి నేర్చుకోవాలని హితవు పలికారు.
Read Entire Article