Macherla B Tech Student Suicide: పల్నాడు జిల్లా మాచర్లలోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య కలకలంరేపింది. కర్నూలు జిల్లాకు చెందిన రేణుక ఎల్లమ్మ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్‌లో స్నేహితులు లేని సమయంలో గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఆమె మరణానికి ముందు సూసైడ్ నోట్ రాసింది.. తన తండ్రి తనని నమ్మలేదని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.