బాలీవుడ్ మాస్ యాక్షన్ హీరోలలో తనదైన స్టైల్‌తో ప్రేక్షకుల మన్ననలు పొందిన నటుడు అజయ్ దేవగన్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘రైడ్ 2’ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. 2018లో విడుదలైన ‘రైడ్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమా, మొదటి భాగాన్ని మించిన యాక్షన్, థ్రిల్, సస్పెన్స్‌తో థియేటర్లలో సందడి చేయబోతోంది.