తెలంగాణ ప్రభుత్వం విద్యా ప్రమాణాల పెంపునకు కీలక చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచి 210 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించనుంది. ఈ తరగతుల కోసం ప్రతి పాఠశాలలో ఒక విద్యా వాలంటీర్ , ఒక ఆయాను నియమించనున్నారు. వాలంటీర్‌కు నెలకు రూ.8 వేలు, ఆయాకు రూ.6 వేలు గౌరవ వేతనం ఇవ్వనున్నారు.