Nellore Accident: నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు దుర్మరణం చెందగా, పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆత్మకూరు మండలం ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ఈ విషాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరోవైపు, ఓజిలీ మండలం రాచపాలెం వద్ద టెంపో బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.