తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ఫస్టియర్ పరీక్షలు జరగనుండగా.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్ పరీక్షల్లో నిమిషనం నిబంధన ఎత్తేశారు. విద్యార్థులను 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతించనున్నారు.