ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ భేటీ కానుంది. సెక్రటేరియట్‌లో జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో అక్రమార్కులకు నిద్రలేకుండా చేస్తోన్న హైడ్రాకు (Hydra) చట్టబద్దత కల్పించేలా ఆర్డినెన్సు తీసుకురానున్నారని సమాచారం. అలాగే, ధరణిపై ప్రభుత్వం వేసిన కమిటీ సిఫార్సులపై చర్చించి.. నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, పలు వర్సిటీలకు కొత్త పేర్లు పెట్టాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, బీసీ గణణపై కూడా క్యాబినెట్ ఆమోదం తెలపనుంది.