భూ కబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. దీని పరిధిని మరింత విస్తరించేలా ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ స్టేషన్‌కు ఏసీపీ తిరుమల్ ఎస్‌హెచ్‌వోగా వ్యవహరించనున్నారు. 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ స్టేషన్‌లో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 12 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 30 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తారు. హైడ్రాకు 70 వాహనాలను ప్రభుత్వం అందజేసింది. మరిన్ని వివరాలు..