భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. మరోసారి వార్తల్లో నిలిచారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అభ్యర్థనపై అంబటి రాయుడు స్పందించారు. ఫాస్ట్ బౌలర్ సిరాజ్‌తో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు క్రీడాకారులకు ఇంటి స్థలాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించగా.. అంబటి రాయుడు, ప్రజ్ఞాన్ ఓజా, గుత్తాజ్వాలాకు కూడా కేటాయించాలని కౌశిక్ రెడ్డి అభ్యర్థించారు. దీనిపై స్పందిస్తూ.. అంబటి రాయుడు.. ఆసక్తికర ట్వీట్ చేశారు.