ఏపీలో నూతన జిల్లాల ఏర్పాటుపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా పాత జిల్లాలు అస్థిత్వం కోల్పోయాయని కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జిల్లాల విభజన తప్పన్న కిరణ్ కుమార్ రెడ్డి.. తానే సీఎం అయితే కలిపేసే వాడినని చెప్పుకొచ్చారు. ఇక నీటి సమస్యలు పోవాలంటే బ్రిజేష్ కుమార్‌ను తప్పించాలన్న కిరణ్ కుమార్ రెడ్డి.. తన తరుఫున చంద్రబాబుకు ఇదే విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.