కైలాస్ మానస సరోవర యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న డీఆర్‌డీవో మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్‌రెడ్డి, ఆయన సతీమణి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎమ్మెస్ రామారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 31 మంది యాత్రకు వెళ్లినట్లు తెలిపారు. నేపాల్‌లోని కొన్ని ప్రాంతాలను ముందుగానే సందర్శించి బయటపడిన తమ బృందం, అనంతరం సంభవించిన భారీ వరదల నుంచి తృటిలో తప్పించుకుందని చెప్పారు. త్రిశూల్ నదిలో వరద ఉధృతితో భారీ నష్టం జరిగిందని వివరించారు. మృతులకు సంతాపం తెలిపిన ఆయన, భారతీయుల తరలింపునకు భారత రాయబార కార్యాలయం సహాయక చర్యలు చేపడుతోందన్నారు.