తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం హోదాలో స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తర్వాత సారపాక గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారుడు బూరం శ్రీనివాసరావు ఇంట్లో సన్నబియ్యం భోజనం చేశారు. లబ్ధిదారుల కుటుంబంతో కలిసి కూర్చొని భోజనం చేశారు. ప్రభుత్వ పనితీరు, పథకల అమలుపై ప్రజలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు.