National Highway 167 Mantralayam New Bypass: కర్నూలు జిల్లా మంత్రాలయానికి బైపాస్ రోడ్డుకు సంబంధించి తొలి అడుగు పడింది. కొత్త బైపాస్ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. రూ.59 కోట్లతో మంత్రాలయానికి బైపాస్‌ను రెండు లైన్లుగా నిర్మిస్తున్నారు. ఈ బైపాస్ అందుబాటులోకి వస్తే మంత్రాలయానికి ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే. నిత్యం మంత్రాలయానికి భక్తులు తరలివస్తుంటారు.. ఈ క్రమంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రభుత్వం బైపాస్ రోడ్డు కోసం నిధులు విడుదల చేసింది.