తెలంగాణలో భూకంపం వస్తుందన్న వార్తలు ప్రజలను కొన్ని రోజులుగా భయపెడుతున్నాయి. అయితే.. ఈ వార్తలపై ప్రముఖ శాస్త్రీయ సంస్థ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI) పూర్తి క్లారిటీ ఇచ్చింది. ఎపిక్ ఎర్త్ క్విక్ అనే సంస్థ చెప్పిన భూకంప వార్తలు పూర్తిగా నిరాధారమని.. ఎలాంటి శాస్త్రీయత లేదని ఎన్‌జీఆర్ఐ తెలిపింది. ఈ వార్తలు నమ్మొద్దని ప్రజలకు సూచించింది. ప్రభుత్వమో లేక శాస్త్రీయ సంస్థలు అధికారికంగా ప్రకటించినప్పుడే నమ్మాలని సూచించింది.