రీల్స్ పిచ్చితో యువత విచక్షణ కోల్పోతున్నారు. ప్రమాదమని తెలిసీ రిస్కులు చేస్తూ.. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. ఓ యువకుడు విష సర్పంతో విన్యాసాలు చేస్తూ.. తమ జీవితాన్ని ముగించాడు. అయితే.. తన తండ్రి ట్రైనింగ్‌లో పాములు పట్టటం నేర్చుకుంటున్న యువకుడు.. నాగుపామును నోట్లో పెట్టుకుని రీల్స్ చేస్తూండగా.. అనుకోకుండా అదే పాము కాటుకు ప్రాణాలు కోల్పోవటం ఇప్పుడు ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.