హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకల వేళ 'జీరో డ్రగ్స్' లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. పబ్‌లు, హోటళ్లు మరియు ప్రైవేట్ ఈవెంట్లలో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దించినట్లు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. వేడుకలు నిర్వహించే యాజమాన్యాలు ఖచ్చితంగా రాత్రి 1 గంటకే కార్యకలాపాలు ముగించాలని.. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ సరఫరా చేసే పాత నిందితులపై నిరంతర నిఘా ఉంచడంతో పాటు, సర్వీస్ అపార్ట్‌మెంట్లు.. హాస్టళ్లలో జరిగే పార్టీలపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.