తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగగా.. రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై.. ఒక గ్రామ ప్రజలు.. కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. రేపటికి (గురువారం) వాయిదా వేసింది. బీసీల జనాభా ఆధారంగా రిజర్వేషన్లను కేటాయించలేదంటూ.. పిటిషనర్లు కోర్టుకు వెల్లడించారు. దీంతో ఇప్పుడు కోర్టు ఏం తీర్పు ఇస్తుంది అనేది తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.