తిరుపతి జిల్లాలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ఓ వ్యక్తి ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే షాక్ తిన్నారు. మహేశ్వరయ్య అనే వ్యక్తి చంద్రగిరి ఈవోగా గతంలో పనిచేశారు. అయితే లంచం తీసుకుంటూ దొరికిపోవటంతో సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుతం బెయిల్ మీద విడుదలయ్యారు. అయితే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉండటంతో ఏసీబీ ఈయనపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే మహేశ్వరయ్య ఇళ్లు, ఫామ్‌హౌస్‌లు, అత్తగారింట్లో సోదాలు జరపగా.. రూ.85 కోట్ల వరకూ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించినట్లు తెలిసింది.