పండుగ వేళ ప్రభుత్వాలు శుభవార్తలు చెప్పటం సర్వసాధారణం అయితే.. రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం వరుసగా గుడ్‌న్యూస్‌లు వినిపిస్తోంది. ఈ క్రమంలోనే.. రంజాన్ పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవలే ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించగా.. ఇప్పుడు మరో శుభవార్త వినిపించారు. నెల రోజులు 24 గంటల పాటు దుకాణాలు తెరుచుకోవచ్చని తెలంగాణ సర్కార్ ప్రత్యే ఆదేశాలు జారీ చేసింది. ఇక.. వాళ్లందరికీ జీతం రెట్టింపు ఇవ్వాలని నిర్ణయించింది.