ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులలో పోటీతత్వం పెంచడం సహా, విద్యావ్యవస్థ ప్రమాణాలను పెంచేందుకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ఇస్తోంది. జూన్ 9న రాష్ట్రంలోని 5 వేల మందికిపైగా విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు అందించనున్నారు. షైనింగ్ స్టార్ అవార్డు కింద రూ.20 వేలు నగదు, మెడల్, సర్టిఫికేట్ అందిస్తారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన వారికి షైనింగ్ స్టా్ర్ అవార్డులు ఇవ్వనున్నారు. మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగే కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు.