ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కోసం, యూట్యూబ్‌లో షార్ట్స్ కోసం పిచ్చి చేష్టలకు పాల్పడే యువతకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వీడియోల కోసం ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ట్రాఫిక్‌లో నోట్లు వెదజల్లుతూ వీడియో తీసిన యూట్యూబర్ మహాదేవ్ మీద కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా పబ్లిక్ ప్లేసుల్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తే కేసులు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.