వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వచ్చారా లేదా ప్రచారం కోసమా అని ప్రశ్నించారు. జగన్ గ్రామాల్లో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నారని సునీత ఆరోపించారు. అనంతపురంలో పులివెందుల తరహా హత్యలు జరగవంటూ పరిటాల సునీత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే తాము అనుకుని ఉంటే జగన్ ఈ గడ్డపై అడుగు పెట్టే వారే కాదని అన్నారు.