పల్నాడు జిల్లాలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. అమరావతి నుంచి క్రోసూరు వెళ్తుండగా ఘటన జరిగింది. తురగావారిపాలెం సమీపంలోకి వచ్చేసరికి బస్సు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డుపైనే ఆపేశారు. ఘటన సమయంలో బస్సులో 10 మంది ప్రయాణీకులు ఉన్నారు.. మంటలు ఆర్పివేయడంతో పెనుప్రమాదం తప్పింది.