Ambati rambabu on Pawan kalyan : పిఠాపురం జయకేతనం సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లు గెలుచుకుని 100 శాతం స్ట్రెక్ రేట్ అంటుున్నారని.. టీడీపీలో టికెట్ దక్కనివారికి, వైసీపీ తిరస్కరించిన వారికి జనసేన టికెట్లిచ్చిందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలలో ఎక్కువ మంది టీడీపీ, చంద్రబాబు మనుషులేనన్న అంబటి రాంబాబు.. జనసేన నిర్వహణను చూసేది చంద్రబాబేనంటూ విమర్శించారు.