ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై కేంద్ర మంత్ర హర్దీప్ సింగ్ పూరీ ఆరా తీశారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి చేసిన ట్వీట్‌కు పవన్ స్పందించారు. తనపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలియజేసిన పవన్ కళ్యాణ్.. మీ మాటలు నాకెంతో బలాన్ని ఇచ్చాయంటూ ట్వీట్ చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్‌కు ఇటీవల వైరల్ ఫీవర్ సోకిన సంగతి తెలిసిందే. అలాగే ఆయన స్పాండిలైటిస్ సమస్యతో బాధపడుతున్నారని డిప్యూటీ సీఎంవో వర్గాలు వెల్లడించాయి.