Mark Shankar Pawanovich Obscene Post Case: సింగపూర్ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేయంతో ఇంటికి వచ్చేశాడు. చిరంజీవి మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి ట్వీట్ చేశారు. ప్రమాదం నుండి కాపాడినందుకు ఆంజనేయ స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే, కొందరు 'ఎక్స్'లో మార్క్ శంకర్‌పై అసభ్యకర ట్వీట్‌లు చేశారు. దీనిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.