ఏపీలో గ్రీన్ కవర్ ప్రాజెక్టు యాక్షన్ ప్లాన్ ఉగాది నుంచి అమలు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ అంశం మీద మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఉగాదిలోపు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని.. గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని శాఖలూ త్రికరణ శుద్ధిగా భాగస్వాములు కావాలని సూచించారు.గ్రీన్ కవర్, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుల్లో స్వజాతి మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ క్రమంలోనే కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటాలని పరిశ్రమల శాఖకు సూచించారు.