AP Govt Special Teams For Social Media Posts Cases: ఏపీ ప్రభుత్వం సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులకు సంబంధించి కేసులపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నమోదైన కేసుల్లో దర్యాప్తు, నిందితుల్ని గుర్తించేందుకు స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దించింది. ఈ మేరకు పోస్టుల ఆధారంగా ఐపీ అడ్రస్‌లు, యూఆర్ఎల్‌లను గుర్తించారు. ఈ టీమ్‌లు ఆయా ప్రాంతాలకు వెళ్లి దర్యాప్తు చేసి ఈ కేసుల్లో నిందితుల్ని అదుపులోకి తీసుకోనున్నాయి. గత నెలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశం గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే.