2019 ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గంలో తన ఓటమికి పవన్ కళ్యాణ్‌తో విభేదాలే కారణమని అన్నారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. కొన్ని కారణాల వలన అప్పుడు అలా జరిగిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ కారణంగానే జనసైనికులు తనను ఓడించారని.. తన ఓటమిలో వారిదే కీలకపాత్ర అని చెప్పారు. అయితే 2024 ఎన్నికల్లో అదే జనసైనికులే.. తనకోసం కసిగా ఓట్లేశారని చింతమనేని ప్రభాకర్ అన్నారు.