రైలు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే దిశగా రైల్వే శాఖ కీలక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా రైళ్లలో దమ్ము కొట్టేవారు, ఉమ్మివేసేవారికి భారీగా జరిమానాలు విధిస్తోంది. మద్యం తాగినా, భిక్షాటన చేసినా భారీ మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో బాధ్యతాయుతంగా వ్యవహరించి.. సజావుగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.