ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి సినీ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్‌ను కలిసి, మనస్ఫూర్తిగా మాట్లాడేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఆ రోజు ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తనకు తెలిసి నిజాలన్నీ ఈ ప్రపంచానికి చెప్తానంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య పవన్ కళ్యాణ్ అంశం హాట్ టాపిక్‌గా ఉన్న తరుణంలో.. బండ్ల గణేష్ ఆయనకు మద్దతుగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.