తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో హైదరాబాద్‌లో పలు ప్రసిద్ధ హోటళ్లు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు గుర్తించారు. గచ్చిబౌలి, మాదాపూర్, హిమాయత్‌నగర్, తుర్కయంజల్ ప్రాంతాల్లోని హోటల్స్‌లో అపరిశుభ్రత, కుళ్ళిపోయిన ఆహారం, సింథటిక్ ఫుడ్ కలర్స్, కుళ్ళిపోయిన మాంసం వంటివి వెలుగు చూశాయి. వీటిని ప్రజలు తింటే వివిధ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా ప్రమాదకరమైన క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.