పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పంట కాలువలోకి కారు దూసుకెళ్లిన ప్రమాదంలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు చనిపోయారు. మరో యువకుడు గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. వీరంతా ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. చనిపోయిన వారు అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు.