పాల్గొన్న మొదటి పారాలింపిక్స్‌లోనే కాంస్య పతకం సాధించి.. ప్రపంచ వేదికపై అటు భారత్ పేరునే కాదు.. ఇటు తెలంగాణ పేరు కూడా వినిపించేలా చేసిన అథ్లెట్ దీప్తి జీవాంజిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. అంతేకాదు.. దీప్తి జీవాంజికి భారీ నజరానా కూడా ప్రకటించారు. దీప్తికి గ్రూప్-2 ఉద్యోగంతో పాటు కోటి రూపాయల నగదు బహుమతి కూడా ప్రకటించారు. అంతేకాకుండా.. వరంగల్‌లో 500 గజాల ఇంటి స్థలాన్ని కూడా దీప్తికి కేటాయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు.