పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్త ఊడ్చిన సీఎం చంద్రబాబు..

1 year ago 26
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటనలో ఆశ్చర్యకరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. కపిలేశ్వరాలయంలో ఆయన పారిశుద్ధ్య కార్మికుడి అవతారమెత్తారు. స్వయంగా చీపురు పట్టి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. కార్మికులతో కలిసి వారి బాగోగులు తెలుసుకున్నారు. తాను కూడా ఒకప్పుడు తిరుపతిలో చదువుకున్నానని, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలనేదే తన ధ్యేయమని ఆయన ఉద్ఘాటించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఫొటోలు కూడా దిగారు. ఆ వివరాలు..
Read Entire Article