తెలంగాణ ఎంపీల పార్లమెంటు హాజరు, ప్రశ్నలు, చర్చల్లో పాల్గొనడంపై ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ 100 శాతం హాజరుతో టాప్‌లో ఉన్నారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అత్యధికంగా 80 ప్రశ్నలు అడిగారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ 21 చర్చలతో ఆ విషయంలో టాప్‌లో నిలిచారు. నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి మూత్రం అతి తక్కువ హాజరు, ప్రశ్నలు, చర్చలతో చివరి ప్లేస్‌లో నిలిచారు.