పిడుగుపాటుకు ముగ్గురు మృతి.. ఈ జిల్లాల్లో ఏ సమయమైనా పిడుగులు.. భారీ హెచ్చరికలు జారీ..

9 months ago 13
జోగులాంబ గద్వాల జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు రైతులు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. రానున్న 24 గంటల్లో తెలంగాణ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో కురిసిన వర్షంతో రహదారులు మునిగిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా కురిసిన వర్షం ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, పిడుగుల సమయంలో పొలాల్లో పని చేయకూడదని అధికారులు సూచించారు.
Read Entire Article