Andhra pradesh Weather update June 3rd 2026: ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో పలు జిల్లాలలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో బుధవారం పలు జిల్లాలలో వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అంచనా వేశారు. ప్రజలు ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.